విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంజే నాయుడు హాస్పిటల్లో జరిగిన 37వ వార్షికోత్సవాన్ని, దాంతోపాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు ముఖ్య అతిధిగా ప్రారంభించి ప్రసంగిస్తూ మనిషిలో సానుకూల తత్వమనేది ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుందన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఎప్పుడూ సానుకూల ధృక్పదం ఉండాలని ప్రతికూల ధోరణితో కృంగిపోరాదన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ఎంజే నాయుడు అనేక ఆరోగ్య సూత్రాలు వివరించి రోగుల సందేహాలు నివృత్తి చేశారు. హాస్పిటల్ ఫౌండేషన్ గౌరవ చైర్మన్ వావిలాల వైద్యశిబిరానికి రజనీకాంత్ శర్మ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన రావడం ముదావహం అన్నారు. సభావేదికకు, హాస్పిటల్ ఎండీ మాధవినాయుడు అధ్యక్షత వహించారు. డాక్టర్లు వంశీ కృష్ణ రవితేజ తదితరులు పాల్గొని వైద్య శిబిరంలో విశేష సేవలు అందించారు. అనంతరం జస్టిస్ మనందరావును హాస్పిటల్ యాజమాన్యం దుశ్శాలువలతో ఘనంగా సత్కరించింది. వార్షికోత్సవాల సందర్భంగా బాలల్లో ఊబకాయం అనే అంశంపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యంగ్య చిత్రలేఖనం, వకృత్వం, పోస్టర్ ప్రదర్శన పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు జస్టిస్ మన్మధరావు నగదు బయమతులు అందచేశారు
Prajavartha Online Telugu News