-పేద ప్రజలను మోసం చేసి డబ్బు కాజేయాలని చూసే కేడి గాళ్ళకు రానున్న రోజులలో సరైన రీతిలో బుద్ది చెప్పాలి -బండి పుణ్యశీల
-సుమారు 150మంది వద్ద డబ్బులు తీసుకున్నారు
-టీడీపీ మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు ఈ కేసులో ప్రధాన సూత్రధారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక భవానీపురం గల ఎన్టీఆర్ జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల ఆదివారం నాడు విలేకరుల సమావేశం ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద పెద్ద స్కాం లు చేస్తుంటే టీడీపీ గల్లీ నేతలు చిన్న స్కాంలు చేస్తున్నారన్నారు.టిడ్కొ ఇళ్లు ఇప్పిస్తామని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు.సుమారు 150మంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు.సుమారుగా రూ.4 కోట్లు ఫ్రాడ్ చేసారన్నారు. సంవత్సరాలు గడిచినా ఇళ్లకు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదంటూ బాదితులు వాపోతున్నట్లు తెలిపారు.ఈ కేసు విషయంలో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారని అసలు ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు అని తెలిపారు.ఈ కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.గ్రౌండ్ ఫ్లోర్ అయితే మూడున్నర లక్ష, ఫస్ట్ సెకెండ్ ఫ్లోర్ అయితే రెండు రెండున్నర లక్షల రూపాయలతో ఇల్లు ఇప్పిస్తానని పేద ప్రజలను మోసం చేసి కొంత మంది వ్యక్తుల దెగ్గర పూర్తి నగదును కట్టించుకొని మరికొంత మంది పేదల దగ్గర కొంత కొంత సొమ్మును కాజేశారన్నారు. వైయస్ ఆర్ కాలనీ, కబేళా, వాంబే కాలనీ ప్రాంతాలలో ఇల్లు ఇప్పిస్తానని ఘరానా మోసం చేసారన్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు హబీబ్ తో పాటు కొటేటి హనుమంతరావుకు కూడా ఈ ఘరానా మోసంలో వాటా ఉందని తెలియజేసారన్నారు.గతంలో చంద్రబాబు పేదలకు ఇల్లు ఇస్తానని రాష్ట్రంలో అనేక మంది పేదలని మోసం చేస్తే నేడు తన తెలుగుదేశం పార్టీ లో ఉన్న నాయకులు పేదల రక్తాన్ని జలగలలా పిండుతున్నారన్నారు.జగనన్న నాయకత్వంలో పేద ప్రజలకు ఇల్లు ఉచితంగా ఇస్తుంటే ఇలాంటి తెలుగు దేశం పార్టీ మాయగాళ్లు పేద ప్రజలను మోసం చేసి వారి వద్ద నుండి డబ్బు కాజేయాలని చూసే కేడి గాళ్ళకు రానున్న రోజులలో సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Prajavartha Online Telugu News