విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మాజీ మంత్రి మారెప్ప కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో మారెప్పతో పాటు జమ్మలమడుగుకు చెందిన బ్రహానందరెడ్డిలను పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర బాధ్యులు క్రిష్టోఫర్ తిలక్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గిడుగు రుద్రరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ వాసు ఆధ్వర్యంలో పెదకూరపాడుకు చెందిన సుమారు 10 మంది యువకులు కూడా పార్టీలో చేరారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ భారత్ జోడో యాత్ర స్పూర్తితో ప్రజా క్షేమాన్ని కాంక్షించే వారంతా కాంగ్రెస్ లోకి వస్తున్నారని పీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News