Breaking News

ది ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ గా జేసీ తేజ్ భరత్ భాద్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ది ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ అర్బన్ చైర్మన్ గా తూర్పుగోదావరి జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ భరత్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.  రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 744, వ్యవసాయ & సహకార శాఖ, తేదీ: 30.10.2023 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకి లోబడి మంగళవారం రాజమహేంద్రవరం స్థానిక ది ఆర్యా పురం అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆరు నెలల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ది ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్, రాజమండ్రి  కి చైర్మన్ గా తూర్పు గోదావరి జిల్లా కు చెందిన జాయింట్ కలెక్టర్ ను,  సభ్యులుగా జిల్లా సహకార ఆడిట్ అధికారి, రాజమహేంద్రవరం, సహాయ రిజిస్ట్రార్ (పరిపాలన) డివిజనల్ సహకార అధికారి రాజమహేంద్రవరం కార్యాలయం వారిని నియమిస్తూ ప్రిన్సిపల్ కార్యదర్శి  చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కే..దినేష్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, తదితరులు అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *