Breaking News

వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, దళారి వ్యవస్థ ను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని దమ్ముగా చెప్పే ధైర్యం మాకుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం 5వ డివిజన్ నందు జీవనోపాధి కి ఇబ్బందులు పడుతున్న నాలుగు కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1లక్ష రూపాయల విలువ గల రెండు టిఫిన్ బండ్లు, రెండు తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. వైసీపీ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై వారి ప్రతి అడుగులో కూడా తోడుగా నిలుస్తూ అండగా ఉంటున్నారని అన్నారు. అదే నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులను తోకలు కతిరిస్తా అని, ఎవరైనా ఎస్సి లలో పుట్టాలని కోరుకుంటురా అని అవహేళన గా మాట్లాడారని, కానీ నేడు జగన్ నా ఎస్సిలు, నా బీసీ లు, నా మైనారిటీ లు అంటూ వారిలో ఒకడిగా వారి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి మన కళ్లకు కనిపిస్తుంది అని అన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న గ్రౌండ్లో నాడు చంద్రబాబు సింగపూర్ వాళ్ళతో చేతులు కలిపి బిల్డింగ్ లు కట్టాలని కుట్రలు చేస్తే, నేడు జగన్ బడుగుబలహీన వర్గాల ఆరాధ్యదైవం బీ.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తూ వారిపట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపించారు అన్నారు. రాష్ట్రంలో గాని, తూర్పు నియోజకవర్గంలో గాని గత ఐదేళ్ళ కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మీ అనుకూల మీడియా, సోషల్ మీడియాను తెచ్చుకోండి, వేదిక మీరే చెప్పండి నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం లో చేసిన అభివృద్ధి గురుంచి దమ్ముగా ధైర్యంగా చెప్పగలను అని, కొండప్రాంతం, కాలనీలలో జరిగిన అభివృద్ధి, రిటైనింగ్ వాల్ నిర్మాణం దేనిమీద అయిన సరే ప్రజలకు వాస్తవాలు వివారిద్దాం అని సవాల్ విసిరారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం లో నాయకులు, జన్మభూమి కమిటీలు చేసిన అవినీతి, కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యాపారాలు, అబద్ధాలు, గ్లోబెల్స్ ప్రచారాలు అన్నింటి మీద చర్చిద్దాం రేడినా అని ప్రశ్నించారు. మీరు చేసిన అవినీతి ని ప్రజల ముందు ఉంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 175 కి 175 సీట్లు గెలిచి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్,మట్ట ప్రసాద్, వంకాయలపాటి సుందర్ రావు,శీను,అప్పారావు, రమేష్, వరుణ్, పెద్ద రాజా, నటరాజ్, శ్రీ లక్ష్మీ, షకీరా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *