Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 20 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ కడియాల వారి వీధిలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014-19 మధ్యకాలంలో నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులోను ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో ఇప్పటికే అనేక పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో 96 సచివాలయాలకు గానూ 89 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో 73 సచివాలయాల పరిధిలో రూ. 12.46 కోట్ల పనులకు సంబంధించి పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 32 సచివాలయాల పరిధిలో పనులు పూర్తి కాగా.. 41 చోట్ల పనులు చివరి దశలో ఉన్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమైతే.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపనలు చేసిన నెలల వ్యవధిలోనే ఆ పనులు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటివరకు డివిజన్లో మూడున్నర కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ అభివృద్ధి రానున్న రోజుల్లోనూ ఇదేవిధంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, నాయకులు కొమ్ము చంటి, మోహన్ రావు, కంభంపాటి మోజస్, బెల్లపు వెంకట్రావు, నాగభూషణం, బుద్దా కుమారి, దాసు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *