Breaking News

బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేసిన హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు,నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బాధితులకు అందజేశారు. గురువారం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో రెండు కుటుంబాలకు 6 లక్షల రూపాయల విలువ గల చెక్కులను హోంమంత్రి అందించారు. చాగల్లు మండలం కలవలపల్లికి చెందిన నిమ్మగడ్డ హిమ వరలక్ష్మికి రూ. 5 లక్షలు, గూడూరి మణి (నందిగంపాడు) ఒక లక్ష రూపాయల చెక్కులను అందుకున్నారు. కలవలపల్లికి చెందిన నిమ్మగడ్డ సూరిబాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తూ.. హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేక విజ్ఞప్తితో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5 లక్షల రూపాయలను మంజూరు చేశారు. అలాగే చాగల్లు మండలం నందిగంపాడుకు చెందిన గూడూరి మురళీకృష్ణ కుమారుడు గూడూరి జయ గణేష్ (18) ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ క్రింద లక్ష రూపాయల చెక్కును మృతుని తల్లి గూడూరి మణికి హోంమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తూ వారికి కొండంత అండగా జగనన్న ప్రభుత్వం నిలుస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలను కొల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి, పిల్లల భవిష్యత్ కు ఎప్పుడూ అండగా నిలుస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి తానేటి వనితల అందించిన సాయం ఎప్పటికీ మరిచిపోలేమని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగంపాడు, కలవలపల్లికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంఖుస్థాపన కార్యక్రమ విజయవంతానికి తగిన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గడ్డిపాడు రైల్వే గేటు దగ్గర ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *