Breaking News

ఆర్బీకే ను ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత

చాగల్లు,నేటి పత్రిక ప్రజావార్త :
విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను ప్రతి అడుగులో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగగా జగనన్న ప్రభుత్వం మార్చిందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. చాగల్లు మండలం మీనానగరంలో చాగల్లు సచివాలయం – 5 సంబంధించిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై గురువారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మీనానగరంలో 21.8 లక్షల వ్యయంతో నూతన ఆర్బీకె నిర్మించారు. ముందుగా ఆర్బీకే ప్రాంగణంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పగటిపూటే రైతన్నలకు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది జగనన్న ప్రభుత్వం మాత్రమే అన్నారు. అలాగే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇవాళ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కనిపిస్తున్నాయని, ఈ క్రాప్‌ ద్వారా ప్రతి ఎకరానూ నమోదు చేస్తున్నామన్నారు. గతంలో లేని విధంగా…. ఏ సీజన్‌ లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగియకమునుపే పంట నష్టపరిహారం జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం తనదేనని హోం మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *