రెండో రోజు ఓటరు గుర్తింపు, నమోదు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత

-రాజమండ్రీ రూరల్ పరిధిలోని ఆరు పోలింగ్ కేంద్రాలలో తనిఖీలు
-డిసెంబర్ 9 వరకు ముసాయిదా ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు కి అవకాశం
-జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, యువ ఓటర్ల ను గుర్తించి వారికి ఓటు హక్కును కల్పించడం లో బి ఎల్ వో లు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. డిసెంబర్ 9 వ తేదీ వరకు ఓటరు నమోదు, మార్పులు చేర్పులు ప్రక్రియ జరుగుతుందని తెలియ చేశారు.

ఆదివారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం పరిధిలోని ఎస్ వి ఎమ్ వి ఈ ఎం ఈ స్కూల్ ఇన్నిస్ పేట లోని 151,152 పి ఎస్ లను, అల్కాట్ తోట లోని ప్రాథమిక పాఠశాల లోని 160 – 163 పోలింగ్ కేంద్రాల ను సందర్శించి, ఓటరు నమోదు గుర్తింపు ప్రత్యేక శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మాట్లాడుతూ, శని ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు గుర్తింపు, నమోదు, మార్పులు చేర్పులు చేయడం జరుగుతోందన్నారు. ప్రత్యేక క్యాంపు ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటి కప్పుడు పరిష్కారం చేసి, ఈ సి ఐ అధికారిక వెబ్ సైట్ లో ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ఈ విధానం లో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రిజిస్టర్లు నిర్వహించి, ఏడు రకాల వివరాలు నమోదు చెయ్యాల్సి ఉందన్నారు. ఈమేరకు బూత్ స్థాయి అధికారులు నుంచి సమగ్ర వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. 18-19 వయస్సు కలిగిన యువ ఓటర్ల నమోదు పై సమాచారం అందుకున్న మేరకు ఈరోజు వొచ్చి ఓటరుగా ఫారం 6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు యువ ఓటర్లు తెలపడం జరిగిందన్నారు. ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన తదుపరి ఎంత మంది యువ ఓటర్ల ను గుర్తించారో బి ఎల్ వో లని కలెక్టర్ ప్రశ్నించారు. 35 మంది వరకు కొత్త ఓటర్లు నుంచి దరఖాస్తు స్వీకరించామని, నిన్న ఈరోజు ఇప్పటి వరకు ప్రత్యేక శిబిరం వద్ద కు వొచ్చి 11 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ కి వివరించారు.

ఆల్కాట్ తోట పోలింగ్ కేంద్రం వద్ద వృద్దులు ఓటు హక్కు కోసం రావడం చూసి వివరాలను జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలుసుకున్నారు. వేరొక నియోజక వర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగిందని, పాత చోట ఇంకా ఓటు ఉన్నట్లు బి ఎల్ వో గుర్తించి, ఫారం 8 ద్వారా ఇక్కడికి బదలీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కి బి ఎల్ వో వివరించారు.

ఈ సందర్భంగా పలువురు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కు వొచ్చి వారి పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఓటరు గా పేరు ను జాబితా లో సరి చూసుకోవడం తో మీ తోటి వారిని ఓటరుగా నమోదు చేసేందుకు అవగాహన కల్పించాలని సూచించారు.

కలెక్టర్ వెంట రాజమండ్రి రూరల్ నియోజక వర్గ ఓటరు నమోదు అధికారి ఎస్. సరళ వందనం, తహశీల్దార్ పి . చిన్నారావు, డిటి సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *