Breaking News

జాతీయ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్

-పైప్ బ్యాండ్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (తాడేపల్లిగూడెం) బృందం
-అభినందించిన విద్యాశాఖా ఉన్నతాధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు (తాడేపల్లిగూడెం) బృందం జాతీయ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీలకు ఎంపికైనట్లు
రాష్ట్ర స్కూల్ బ్యాండ్ నోడల్ అధికారి జి.భానుమూర్తిరాజు తెలిపారు. రాష్ట్ట్ర స్థాయి పోటీల్లో (పైప్ బ్యాండ్ – బాలురు) విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకున్న తర్వాత, ఆదివారం (డిసెంబరు 3న) కేరళలోని తిరువనంతపురం జీవీరాజా స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన సౌత్ జోన్ (సదరన్ రీజియన్) స్థాయిలో 9 రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం నిలబెట్టడం గర్వకారణమని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు  విద్యార్థి బృందాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల కవాతులో ఈ బృందం పాల్గొనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *