Breaking News

పెన్షనూ పెరిగింది.. పెన్షన్ దారులు పెరిగారు : హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం నాడు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్ దారులకు 6 లక్షల 60 వేల రూపాయల పెన్షన్ ను లబ్ధిదారులకు హోంమంత్రి స్వహాస్తాలతో అందజేశారు. దీంతో కొవ్వూరు రూరల్ మండలంలో పెన్షన్లు 10266 నుండి 10,438కి పెరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద పెన్షన్ల ఖర్చు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల తొంబై తొమ్మిది వేల రూపాయలకు పెరిగింది.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కొవ్వూరు నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 620 మందికి నూతన పెన్షన్లు అందజేశామన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కోవ్వూరు టౌన్ లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ జనవరి నెల నుండి కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 32,298 మందికి 9కోట్ల 48 లక్షల 32వేల 500 రూపాయలను ప్రతి నెలా అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు. అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్‌ మొత్తం జనవరి నెల నుంచి మూడు వేల రూపాయాలకు జగనన్న ప్రభుత్వం పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పెంపు, నూతన పెన్షన్ల మంజూరైన వారికి పెన్షన్ పంపిణీ ఉత్సవాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్ మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టాక పెన్షన్ల మంజూరు, పెన్షన్ పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివరించారు. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వంలో అందించిన పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. జగనన్న ప్రభుత్వంలో ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేసి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని తెలిపారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మ్యానిఫెస్టోలో 99.9 శాతం హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన మాట ప్రకారం.. రూ.3,000ల పెన్షన్‌ అమలుపై పెన్షన్ దారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు మన వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి విజనరీకి తార్కాణమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా కొత్త పెన్షన్ మంజూరుకావాలంటే.. కులం, మతం, పార్టీ చూసి జన్మభూమి కమిటీలు సిపారసు చేస్తే అప్పుడు పెన్షన్ దారులు ఎవరైనా చనిపోతే గానీ వారిస్థానంలో గానీ కొత్తగా పెన్షన్ ఇవ్వలేని దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందజేస్తూ.. పొరపాటున ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ 6 నెలల దాటకుండానే పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మీ ఇంటి బిడ్డగా ఆలోచించి.. ఎవరికి, ఏ అవసరం ఉన్నా.. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పెన్షన్‌ ప్రస్తుతం రూ.3,000కి పెంచి ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో 2014 –19 కాలంలో సగటున నెలకు ఖర్చు చేసింది కేవలం రూ. 400 కోట్లు మాత్రమేనని.. జగనన్న ప్రభుత్వంలో నెలకు 1963 కోట్ల రూపాయలను అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న కోటాలు, కోతలు, వీలైనంత మందికి ఎలా ఆలోచనలు లేవనన్నారు. కులం, మతం, వర్గం, ఏ పార్టీ అనేది కూడా చూడకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గతంలోలా లంచాలు, వివక్ష, మధ్య దళారీలు, బ్రోకర్లు, పక్షపాత జన్మభూమి కమిటీలు వంటివి లేవన్నారు. ప్రతి నెలా మొదటి రోజే అది ఆదివారమైనా, సెలవుదినమైనా మీ గడప ముందుకొచ్చి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేస్తున్నారని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. పిల్లలకు అమ్మఒడి, మహిళలకు చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి ఎన్నో పథకాల అమలు మహిళా సాధికారిత వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను రూపుదిద్ది అమలు చేశామని హోంమంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా.. గత పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనించి.. జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి మీ చల్లని దీవెనలతో ఆశీర్వాదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు. ఈ సందర్భంగా వృద్యాప్య పింఛన్ దారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. సీఎం జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా, కొవ్వూరు ఎమ్మెల్యేగా తానేటి వనితనే గెలుస్తారని తెలిపారు. ఇంటికే గుమ్మం దగ్గరకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిస్తున్నారని.. తమ లాంటి వృద్దులకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత చేసిన సహాయ, సాకారాలను చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నూతన పెన్షన్ దారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *