Breaking News

స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంతో ముందుకు వెళదాం.

-అమ్మ ఒడి పథకం ఒక సంస్కరణ.
-అమ్మఒడి ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నాంది పలికిన జగనన్న
-రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనులను పురోగతి వేగవంతం చేయండి
– జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రూరల్ నియో జకవర్గ అభివృద్ధి పనులలో పురోగతిని వేగవంతం చేయాలని పెండింగ్ లో ఉన్న పనులన్నీ నిర్దుష్ట కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణు శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారుల ఆదేశించారు. .

సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ ఇతర జిల్లా స్థాయి, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులతో రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న పనులు పురోగతిపై జిల్లా ఇంచార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న ఏ ఒక్క ఒక్క పని ఎటువంటి జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.

ప్రజల చేత నేడు సమాజంలో అత్యంత గౌరవింపబడిన వ్యవస్థలు రాజకీయ, న్యాయ , అధికార వ్యవస్థలు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఆయా ప్రాంతాల అభివృద్ధి కొరకు కృషి చేసేందుకు నాయకులు ఇచ్చే ఆదేశాన్ని త్వరిత గతిన అమలు చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వానికి మరో అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దశా నిర్దేశం లో అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం తరతమ భేదం లేకుండా అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా అవసరాలకు తగ్గట్టు నాయకులు నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే వాటి అందచెయ్యడం లో అధికారులు బాధ్యతో పేద ప్రజలకు ఫలాలు అందజేయడం ద్వారా ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో ఏ పేద పిల్లవాడు బాల బాల కార్మికునీగా ఉండకూడదు అన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు.

జలజీవన్ మిషన్ ద్వారా అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ప్రారంభించిన ప్రతి పని పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణం పై సమీక్షిస్తూ రూరల్ నియోజక వర్గంలో 4 లేఔట్ లో 5431 ఇళ్ల స్థలాల్లో గృహా నిర్మాణం పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 1864 విగ్రహాలు పూర్తయ్యాయని మిగిలిన గృహా నిర్మాణాల పురోగతి ఉన్నట్లు తెలిపారు. వాటిని మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అసంపూర్తిగా మిగిలిన చిన్నచిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులోభాగంగా ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, గ్రామ సచివాలయాలు, ఆర్ బి కే, వెల్నెస్ సెంటర్, గృహనిర్మాణం, నాడు-నేడు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగాలపై సమీక్షించారు.నియోజకవర్గంలో ఏవైనా సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వేగవంతంగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఉపాధి హామీ కింద రూ.27.12 కోట్ల ప్రతిపాదించామని, ప్రాధాన్యత భవనాలు జిజి ఎంపి, ఎంపి ల్యాడ్, నాబార్డ్, సి ఎస్ ఆర్, ఇతర పనుల కోసం రు.50.54 కోట్ల తో 274 పనులకు గాను రూ.37. 55 కోట్లు ఖర్చు చేసి 129 పూర్తి కాగా 132 పనులు పురోగతి లో ఉన్నట్లు తెలిపారు.

మండల స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, జగనన్న విలేజ్‌ క్లీనిక్‌, పాలసేకరణ కేంద్రం, వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ, తదితర ప్రభుత్వ భవన నిర్మాణా లను పూర్తిచేయాలని పేర్కొన్నారు.

సమీక్ష సమావేశంలో జాయింట్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, డిఆర్ఓ జే. నరసింహులు, ఆర్డిఓ ఏ చరిత్ర వర్షిని, సిపిఓ ఎల్.అప్పలకొండ,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి,హౌసింగ్‌, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ, డి ఎం హెచ్ ఓ విద్యుత్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురానున్న గోవా షిప్‌యార్డ్

-రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ -సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *