Breaking News

పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలకి జగనన్నే ఆరోగ్య భరోసా

-రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా రు.25 లక్షల వరకు ఉచిత వైద్యం
-రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలోని నగరపాలక సంస్థ వార్డుల్లోని 4313  మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ . 1,30,36,000/- పంపిణీ.
-పేదవానిఇంట పెద్ద  కొడుకుగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి
-మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త :
పేద వాడి ఆరోగ్య  భద్రతకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాడు వైయస్ఆర్ అయితే, ఆయన తనయుడిగా నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో రెండడుగులు ముందుకేసి  ఆరోగ్య శ్రీ ద్వారా రు. 25 లక్షలు చేశారన్నారు. గతంలో ఉన్న వార్షిక ఆదాయ పరిమితి ని రూ. 5 లక్షలకు పెంచి మరింత మందికి ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. సోమవారం  రాజమహేంద్రవరం రూరల్  నియోజకవర్గం లోని ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ పరిధిలో గల డివిజన్ల లోని లబ్ధిదారుల కొరకు ఏర్పాటుచేసిన  పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో  జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు పెన్షన్ రు.2750 నుండి 3000 వరకు పెంచి అవ్వ తాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని  అందించి సంక్షేమ ఫలం అంటే ఇదేనని నిరూపించా రని అన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గంలోని నగరపాలక సంస్థ వార్డుల్లోని 14 సచివాలయాల పరిధిలో నూతనంగా పెంచిన 48  పెన్షన్ల కలుపుకొని 4313  మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ . 1,30,36,000/- అందిస్తున్నామన్నారు.

పేదవాడి ఇంటి పెద్ద కొడుకులా సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృక్పథంతో రేషన్ కార్డ్,  ఆరోగ్యశ్రీ, ఫామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారాన్నారు.  పేదవాని ఆరోగ్య భద్రతే లక్ష్యంగా  కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని అందించే దిశగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రు. 25 లక్షల రూపాయల ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నా రన్నారు. ప్రజలను, దైవాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయ లేరని మంత్రి పేర్కొన్నారు.

గతంలో 65 సంవత్సరాలు వయసు   ఉంటేనే గాని పెన్షన్ వచ్చేది కాదు, కాని జగనన్న ప్రభుత్వం వచ్చాక 60 సంవత్సరాలకి కుదించి అర్హులందరికీ  పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. గత ప్రభుత్వం 2019 జనవరిలో హడావిడిగా 2000 చేసి ఫిబ్రవరి మాసంలో అందిస్తే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక  పేదల పట్ల ఉన్న గొప్ప గౌరవంతో దానిని రు.2250 చేసి, ఇచ్చిన హామీ నిలుపు కుంటూ నేడు రు.3000 గా చేసి లబ్ధిదారులకు  అందిస్తున్నా మన్నారు. గత ప్రభుత్వం ఎప్పుడైనా 1 వ తేదీన పెన్షన్ అందించడం చూశారా? నేడు వాలంటరీ ద్వారా 1వ తేదీ ఉదయాన్నే ఇంటింటికి  ఈ ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన పెంపు పంపిణీ ని ప్రజల మధ్య జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఒక పెద్దమ్మ నాతో అంటుంది… నాయనా… నాకు ఇద్దరు కొడుకులు.. . పెద్ద కొడుకు సిఎం.. రెండో కొడుకు కూలీ పనులు చేస్తాడు అని చెప్పడం జరిగిందని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎలా ఎందుకని ఆవిడని ప్రశ్నించగా..  ప్రతినెలా ఒకటవ తేదీన మొన్నటి వరకు రు 2750, నేడు రు. 3 వేలు పెన్షన్ సొమ్ము, నా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డు, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు, జగనన్న సురక్ష వైద్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటి వద్దనే డాక్టర్ సేవలు అందిస్తున్నారని, ఇదే కాకుండా ఇంటి వద్ద కే వాహనం ద్వారా నిత్యవసర సరుకులు, మా సమస్యలు పరిష్కారం చేసేందుకు సచివాలయ , వాలంటీర్ వ్యవస్థ, ఇవ్వన్నీ చేస్తూ ఇంటికి పెద్ద కొడుకుగా జగనన్న ముఖ్యమంత్రి హోదాలో మమ్మల్ని సంరక్షణ చేస్తున్నారని చెప్పారన్నారు. . ఇంటికి పెద్ద కొడుకుగా జగన్ తన బాగోగులు చూసుకుంటూ అన్ని సమయాల్లో భరోసా ఇస్తున్నారని ఆ ఆ పెద్దమ్మ అందని పేర్కొన్నారు.

డా వైయస్ఆర్ హయాంలో 2230 జబ్బులకు చికిత్స అందిస్తే, ప్రతిపక్ష నాయకుడు హయాంలో వాటిని 900 కి తగ్గించడం జరిగిందన్నారు. డా వైయస్ఆర్ హయాంలో రూ.2 లక్షల యాభై వేల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారన్నారు. నేడు సీ యం జగన్ మోహనరెడ్డి హయాంలో 108 , 104  అంబులెన్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడమే కాకుండా, రూ.25 లక్షల వరకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే ఆరోగ్య భరోసా ఇచ్చారన్నారు.

ఇవే కాకుండా  అర్హులైన వారు ఏ ఒక్కరు మిగలకూడదనే  లక్ష్యంతో జల్లేడిపట్టి మరి  లబ్ధిదారుల గుర్తించి అర్హత గల వారందరికీ ప్రభుత్వ పధకాల ప్రయోజనాలు అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వంలో సంవత్సరానికి పెన్షన్ లబ్ధిదారులకు రు. 10 కోట్ల 80 లక్షల అందిస్తే , స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక నెలలోనే రు.14 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

మంత్రి తొలుత జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్. చందన నాగేశ్వర్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మాజీ ఎంపీపీ రేలంగి వెంకట సత్యనారాయణ, స్థానిక నాయకులు దుంపా చంద్రారెడ్డి,విజయ దుర్గా రెడ్డి, గాడ తాతారావు, బాబ్జి రెడ్డి , లబ్ధిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *