Breaking News

ప్రజల నుంచి 39 అర్జీలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సృతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి 39 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి సేవలు అందించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం పరిధిలోని భాస్కర్ నగర్ నందు అక్రమ నిర్మాణం తొలగించవలసిందిగా కోరుట వీరభద్ర నగర్ లోని పారిశుద్ధ్యం రోడ్డు మార్గం మంజూరు చేయవలసిందిగా అభ్యర్థన గాంధీ నగర్ లో మురికి కాలువ డ్రైనేజీ సదుపాయాలు కల్పించవలసిందిగా గృహాలు మంజూరు చేయవలసిందిగా కోరుట తదితర అంశాలపై 39 వినతులు స్వీకరించామన్నారు. స్పందన కార్యక్రమంలో లో మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, సిటీ ప్లానింగ్ అధికారి జివిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *