Breaking News

పండుగ వాతావరణంలా అంబేద్కర్ స్మృతి వనం

-ఆంధ్ర రాష్ట్రానికి అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం ఒక మైలురాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రారంభోత్సవానికి సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులు తుది దశలో చేరుతున్న వేళ పండుగ వాతావరణం నెలకొల్పింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 19న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ఉన్నత అధికారులు అందరూ కలిసి ప్రారంభోత్సవ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు అందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం అందాలను వీక్షించారు. రాష్ట్రమంతా కలిసి పండుగ వాతావరణం నెలకొల్పిన శుభవేళ ప్రజలందరూ వెయ్యి కళ్ళతో జనవరి 19న జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైస్ శ్రీలక్ష్మి అన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *