Breaking News

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతి వనం

-తుదిమెరుగుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం రాత్రి స్వరాజ్ మైదానంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతి వనం తుది దశ పనులు పరిశీలించారు. అంగరంగ వైభవంగా, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్మృతి వనం తుది దశ పనులు దగ్గరుండి పరిశీలించి నాణ్యత ప్రమాణాలు లోపించకుండా సత్వరగా మిగిలిన పనులను పూర్తి చేయాలని, మరోవైపు ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రధమ ముఖద్వారం నందు సాండ్ స్టోన్ పాలిషింగ్ పనులు సత్వరమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని ప్రాజెక్ట్ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో నడిబొడ్డున 19 ఎకరాల విస్తరణలో అంబేడ్కర్ స్మృతివనంలోని మ్యూజియంలో ప్రదర్శించే ఛాయాచిత్రాలు మరియు కళాఖండాలు అంబేడ్కర్ ఆయన చిన్నతనంలో చేసిన కృషిని మరియు దేశంలో అత్యంత గౌరవమైన నాయకుడిలా మారడానికి తన మార్గంలో అడ్డంకులను ఎలా అధిగమించారో తెలియజేస్తాయని . అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన సంఘటనను ప్రదర్శించడానికి పార్కు వద్ద ఆధునిక ఏర్ కండిషన్ థియేటర్, మ్యూజియం మరియు లైబ్రరీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *