-పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
-ఇంజనీరింగ్ విద్యార్థులతో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్’ అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిఫ్ తో పాటు స్టైఫండ్ కల్పించే సదవకాశాన్ని ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ సమన్వయంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష చేపట్టిందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్’ ఆన్ లైన్ ఓరియెంటేషన్ ప్రొగ్రాం మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ IAS., ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ IAS., పాఠశాల విద్యాశాఖ కమీషనర్ (ఇన్ఫ్రా) కె.భాస్కర్ IAS., సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., పాఠశాల విద్య, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ అధికారులు పాల్గొన్నారు. ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్’ ఆన్ లైన్ ఓరియెంటేషన్ ప్రొగ్రాం మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ IAS., ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ IAS., పాఠశాల విద్యాశాఖ కమీషనర్ (ఇన్ఫ్రా) కె.భాస్కర్ IAS., సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., కార్యక్రమ కో ఆర్డినేటర్ మువ్వా రామలింగం, పాఠశాల విద్య, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్ఠాత్మక విద్యాభివ్రద్ది కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు దృష్టి సారించాలని కోరారు. ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, విద్యార్థుల ట్యాబులు వాడకంపై 3 – 4 నెలల పాటు మార్గనిర్దేశం చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ఈ తరహా చర్యలు చేపట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. 8, 9వ తరగతుల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే సౌకర్యాల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహించాలని ఫ్యూచర్ స్కిల్ నిపుణులను కోరారు.
వచ్చే ఏడాది నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే కొత్త సబ్జెక్టును ప్రవేశపెడతామని తెలిపారు. ప్రపంచ పోటీకి విద్యార్థులను సంసిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలను రూపొందించిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, చాట్ GPT, వెబ్ 3.0, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వంటి టూల్స్ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఈ సంస్కరణలు దృష్టి సారిస్తాయని అన్నారు.
ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్స్ చేయాల్సినవి
– విద్యార్థులందరూ ట్యాబులు తీసుకెళ్ళడం, వారిని ఉపయోగించమని ప్రోత్సహించడం.
– ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరినీ IFPలు మరియు ట్యాబ్‌లను ఉపయోగించేలా చేయండి
– భవిష్యత్తులో సాంకేతికతను ఉపయోగించడం గురించి అవగాహన కల్పించడానికి 7వ తరగతి విద్యార్థులతో మాట్లాడటం.
– విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించడంలో ప్రోత్సహించడం, నిర్వహించడంలో నిపుణులుగా తీర్చిదిద్దడం.
– అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ శ్రీ కె హేమచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 22న ప్రారంభించి చరిత్ర సృష్టిస్తున్నామన్నారు. విజయవంతంగా నిర్వహించడానికి ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి చొరవ వల్ల విద్యార్థుల్లో సాంకేతికత పట్ల భయాన్ని దూరం చేసి, వారి కెరీర్‌ను నిర్మించుకోవడానికి మార్గం చూపవచ్చన్నారు. ఇంటర్న్‌షిప్‌గా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు 8 క్రెడిట్‌లను అందజేస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News