Breaking News

సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నదే లక్ష్యం…

-నెడ్ కాప్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వేల్పుల రవికుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి భావితరాలకు ఇంధన కొరతను నివారించాలన్నదే లక్ష్యంగా సేవలందిస్తానని నెడ్ కాప్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వేల్పుల రవికుమార్ తెలిపారు.
నెడ్ కాప్ రాష్ట్ర నూతన చైర్మన్ గా నియమితులైన వేల్పుల రవికుమార్ గురువారం తాడేపల్లిలోని సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ నానాటికి అంతరిస్తున్న ఇంధన వనరులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించిందన్నారు. సౌర శక్తిని వినియోగించుకొనే వారిని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు రాయితీలను మంజూరు చేసి సోలార్ ప్యానల్స్ ను అమర్చుకొనేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఆయన లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తాను శాయిశక్తుల కృషి చేస్తానన్నారు. దళిత సామజిక వర్గాల వారికి కూడా సముచిత స్థానం కల్పించి సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (నెడ్ కాప్) చైర్మన్ గా తనను నియమించడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి శాఖకు గుర్తింపు వచ్చేల శక్తి వంచన లేకున్నా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు సచివాలయాలలో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసి పూర్తిగా సౌర విద్యుత్ ను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. బహుళ అంతస్తులు నిర్మించుకునే వారు వ్యాపార, వాణిజ్య రంగాలకు, భవనాలకు సౌర విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి చేస్తున్నామన్నారు. సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకొనే ఔత్సాహిక రైతులకు రాయితీపై సౌర శక్తి పరికరాలను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యతనిస్తామన్నారు. విద్యుత్ చార్జీలు నానాటికి భారం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సౌర శక్తి వినియోగంపై ప్రజలను చైతన్య వంతులను చేసి ఇంధన వనరుల వినియోగాన్ని కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని చైర్మన్ రవికుమార్ అన్నారు.
తొలుత పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ను ప్రభుత్వ విప్, శాసన సభ్యులు సామినేని ఉదయభాను, శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎం. శేషగిరిరావు, లిడ్ కాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, మానవ హక్కుల కమిషన్ సభ్యులు జి. శ్రీనివాసరావు, దళిత సంఘం నాయకులు వేల్పుల జాన్ అజయ్ కుమార్, రాష్ట్ర నెడ్ కాప్ వీసీ అండ్ ఎండి ఎస్. రమణారెడ్డి, జనరల్ మేనేజర్లు జి. ఎర్రం రెడ్డి, కె. శ్రీనివాసులు, జి. హరినాధ్ బాబు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు నానిబాబు, బుచ్చిబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు, తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *