వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తా… : సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడకి తలమానికంగా ఉన్న వస్త్రలత లో సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత పాలకులు వస్త్రలత అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం వస్త్రలత ను సందర్శించారు. వస్త్రలత టెక్స్ టైల్స్ అసోసియేషన్ ను సందర్శించి సభ్యులతో మాట్లాడారు. వస్త్రలత అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓలేటి జగన్మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుజనా చౌదరి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా గెలవగానే వస్త్రలత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 60 ఏళ్లుగా వస్త్రలత లో వ్యాపారస్తులు చేస్తున్న సేవలను కొనియాడారు. వస్త్రలత అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓలేటి జగన్ మోహన్ రావు మాట్లాడుతూ సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని వ్యాపారస్తులకు అడ్డంకిగా మారిన క్రెడిట్ ఎలిజిబిలిటీ సమస్యలను టెక్స్టైల్స్ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులను తెలియజేశారు. వ్యాపారస్తుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సెక్రెటరీ కొత్త అనిల్ కుమార్ వస్త్రలత వ్యాపారులు . బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూర్ శ్రీరామ్ నాయకులు పైలా సోమినాయుడు ఎం ఎస్ బేగ్ . టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *