Breaking News

బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా ట్స్ లు స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచి  సీలు…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రీ రూరల్ పార్లమెంట్,  అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన అన్ని బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యా ట్స్ లు విజయవంతంగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచి  సీలు వేయడం జరిగిందనీ రాజమండ్రీ రూరల్ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో పోలీసు భధ్రత మధ్య 051- రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం కు చెందిన ఈ వి ఎమ్ లను   నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నందు భద్ర పరచి సీల్ వెయ్యడం జరిగిందని తెలిపారు. నిన్నటి రోజున పార్లమెంట్ సిగ్మెంట్ కి చెందిన బ్యాలెట్ యూనిట్స్ భద్ర పరుచుటకు జరిగినదని, ఈ రోజు అసెంబ్లీ సిగ్మెంట్ కి చెందిన ఈవీ ఎమ్ లను భద్ర పరుచుటకు జరిగినదని ఆమె తెలిపారు.

051 – రాజమండ్రీ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం పార్లమెంటు , అసెంబ్లి సిగ్మంట్ కు చెందిన బ్యాలెట్ యూనిట్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్  (NAC) హాస్టల్ భవనం, కలెక్టరేట్‌, ధవళేశ్వరం నందు 264 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  324 బ్యాలెట్ యూనిట్స్,  324 కంట్రోల్ యూనిట్స్, 348 వివి ప్యాట్స్ చొప్పున యూనిట్స్ స్ట్రాంగ్ రూమ్ నందు భద్ర పరుచుటకు జరిగినదని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *