మతతత్వ పార్టీలకు దూరంగా ఉండండి… : తాంతియా కుమారి 

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో బిజెపి పార్టీ తోపాటు రాష్ట్రంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు దూరంగా ఉండాలని తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాంతియా కుమారి శనివారం పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలను ఆదరెంచే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆ విలేఖర్లతో మాట్లాడుతూ తల్లిని, చెల్లిని పట్టించుకోని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని ఆమె ప్రశ్నించారు. దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి గా తమ తండ్రి కోనేరు రంగారావు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ లో సేవలు అందించారన్నారు. సోనియగాంధీ, రాహుల్ గాంధీల ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు అహర్నిశలు పనిచేస్తానన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ కూటమిగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళతామన్నారు. నాన్న కోనేరు రంగారావు తో నియోజకవర్గ ప్రజలకు ఉన్న ప్రత్యక్ష పరిచయాలు ఆయన అందించిన సేవలు నన్ను గెలిపిస్తాయన్నారు. నాలుగు మండలాలలో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గోళ్ళ వెంకట గురునాధరావు, మండల పార్టీ అధ్యక్షుడు గుడ్డల రాంబాబు, మండల కార్యదర్శి పి శాతభూషణం సిపిఎం నాయకులు నాగరాజు జ్ఞానరత్నం, పి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *