Breaking News

కార్పొరేషన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు డాక్టర్ బాబాసాహెబ్ బీమ్ రాయి రాంజీ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేనేజర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ 2 i/c శ్రీనివాసరావు కార్పొరేషన్ సిబ్బందితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ 2 i/c శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నేటి యువత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని అన్నారు. కార్పొరేషన్ లో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలలో విజయవాడ నగర పాలక సంస్థ మేనేజర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ 2 ఇంచార్జ్ శ్రీనివాస్ తో పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *