Breaking News

ప్రలోభాలకు లొంగి ఉంటే మీ పక్కన కూర్చునేవాడిని… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రలోభాలకు లొంగి ఉంటే మీ పక్కన కూర్చునేవాడిని నిజాయితీపరుడు గనకే మీలాంటి వాళ్లతో మాటలు పడుతున్న. 10 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాం ప్రజల కోసమే పని చేసాం ప్రతిపక్ష నేతగా అనేక సమస్యల మీద నిరంతరం పోరాడా ఇది నా చరిత్ర, ఉద్యమాల నుంచి ఉద్భవించ ఇది నా పుట్టుక. కాంగ్రెస్ కార్యాలయాన్ని కమలం కార్యాలయంగా మార్చిన వాళ్ళకి చాలా సమయం పడుతుంది నా గురించి తెలుసుకోవాలంటే. కాంగ్రెస్ కార్యాలయం ఒక చరిత్ర అన్నారు నేడు ఆ చరిత్రని చెత్తబుట్ట లో వేసి కమలం కండువా కప్పుకున్న వారు ప్రజలకి సమాధానం చెప్పాలి మీరు చేసిన తప్పును ఒప్పుకొని వెంటనే నగరాలకు క్షమాపణ చెప్పండి లేదంటే చరిత్ర హీనులు కాక తప్పదు.

నా ఒక్కడి మాటలు పట్టించుకోక్కర్లేదు అనుకున్నప్పుడు గుంపులు గుంపులుగా నగరాల పెద్దలు దేనికోసం ,ఎవర్ని ప్రసన్నం చేసుకోవడం కోసం సాటి నగరాల కులస్తుడినైనా నామీద ప్రెస్ మీట్ లు పెట్టడం సమాజానికి సమాధానం చెప్పాలి.

చిట్టి పాల ఫ్యాక్టరీ కోసం భూమిని దానం చేసిన దాన కర్ణుడు అటువంటి గొప్ప వ్యక్తి గురించి స్తుతించకుండా ఆయన భూదానం వలన నిర్మాణం ఐన పాల ఫ్యాక్టరీలో ఒక ఇంజనీర్ గురించి వారి కుటుంబం గురించి పొగుడుతున్నారంటే వీళ్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దేనికి లొంగిపోయారో విజ్ఞులైన ప్రజలు చాలా సునాయసంగా మీ స్వభావాల్ని అర్థం చేసుకుంటారు.

నామినేషన్.వేసిన రోజునే 500 కోట్ల రూపాయల దివాలా ప్రకటించిన గొప్ప వ్యక్తి సృజనా చౌదరి ఒక్కసారి మీ తెలివితేటలని వాడి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులను కాపాడండి. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో చిన్న చిన్న లోన్లు తీసుకొని ఇల్లు అమ్ముకునే స్థితికి దిగజారిపోయిన నా పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం సుజనా చౌదరి ని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో మీరు బ్యాంకుల ద్వారా కొట్టేసిన 5700 కోట్లలో ఒక 100 కోట్లు కట్టి వి ఖాతాదారులును కాపాడాలని సృజనా చౌదరి కి.& నగరాల పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా.

పిల్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నగరాల యువజన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్.

ఈ సమావేశంలో కొరగంజి వెంకటరమణ ,పోతిన రమేష్, తొత్తడి భరత్, బాయన బెనర్జీ, పిల్లా సూరిబాబు, శాన చిన్ని, అడ్డూరి తమ్మారావు, పిల్ల వంశి, పొట్నూరి శ్రీనివాసరావు, తమ్మిన రఘుబాబు, దాసిన జగదీష్ పోతిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *