హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ఈనెల 4వ తేదీ పి ఓ లు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు, 5వ తేదీ ఓపిఓలకు, 6 వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్లు తదితరులకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ, 8 వ తేదీలలో నిరంతరం ఫెసిలిటీ కేంద్రాలను రిటర్నింగ్ అధికారుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని ఎవరైనా ఇంకనూ తప్పిపోయి ఉంటే తప్పిపోయిన ఓటర్లు కానీ సిబ్బంది గాని పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేవారు వారికి ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్నదో అదే చోట పోస్టల్ ఓటింగ్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు పోస్టల్ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లు గన్నవరంలో జడ్పీ హైస్కూల్ బాయ్స్, గుడివాడలో వికేఆర్ వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాల, పెడనలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల ( నందమూరు), మచిలీపట్నంలో నోబుల్ కళాశాల, అవనిగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు ఎస్ కె ఆర్ ఆర్ జడ్పీ హైస్కూల్, పెనమలూరు లో జడ్పీ హైస్కూల్ లలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సంబంధించి మచిలీపట్నం చిలకలపూడి లోని పాండురంగ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఫెసిలిటిషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *