Breaking News

ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 సి ప్రకారం , u/s 20 ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం జిల్లాలో పోలింగ్ రోజు అనగా మే 13వ తేదీకి 48 గంటలు ముందు అనగా మే 11వ తేది సాయంత్రం 6 గంటల నుండి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు,కల్లు అంగళ్లు, హోటల్లు, రెస్టారెంట్ క్లబ్బులు, ఇతర మద్యం షాపులు మూసి ఉంచాలని, డ్రై డే (dry day) పాటించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజు అనగా జూన్ 4వ తేదీకి 48 గంటలు ముందు ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్ద వద్ద డ్రై డే గా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *