Breaking News

ప్రచారజోరు… పులకించిన పుత్తూరు

-తల్లి రోజాతో పాటు ప్రచారంలో కుమార్తె. కుమారుడు
-కుటుంబ సభ్యులతో పాటు ప్రజాకుటుంబంలోకి
-ప్రత్యేకత సంతరించుకున్న ప్రచారం
-ఓటుతో ఆశీర్వదించండి అన్న మంత్రి

పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి ఆర్కేరోజా తన కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కష్ణకౌశిక్‌తో కలిసి ప్రచారం చేయడంతో పుత్తూరు మండలంలోని కేబీఆర్‌ పురం, కష్ణ సముద్రం పులకించింది. తల్లి చేసే సేవలు మరింత మందికి అందాలి… ఆ మహత్కార్యంలో మా పాత్ర కూడా ఉండాలంటూ పిల్లలు పాల్గొనడంతో ప్రచారం ప్రత్యేకతను సంతరించుకుంది. వారికి స్థానిక ప్రజలు క్రేన్‌ ద్వారా భారీ గజమాల వేసి ఆహ్వానం పలికారు. ప్రచార ర్యాలీనా, విజయోత్సవ ర్యాలీనా అనే విధంగా ప్రచారానికి భారీగా జనం హాజరయ్యారు. అడుగడుగునా హారతి పట్టారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గం లో తాను చేసినటువంటి అభివద్ధి గత 35 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదన్నారు. ఇది ప్రచారం కోసం చెప్పే మాటలు కావని ప్రత్యక్ష సాక్షాలివిగో అంటూ తన అభివద్దిని చూపే చిత్రపటాలున్న కరపత్రాలను పంపిణీ చేశారు. నగరి నియోజకవర్గంలో పుత్తూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, విజయపురంలో ఐటిఐ కాలేజి, జూనియర్‌ కాలేజిలు, నగరి పుత్తూరు లలో మునిసిపల్‌ పార్కులు, షాదీ మహల్, ఆదునాతన శ్మశాన వాటికలు, ఆదునీకరించిన ప్రభుత్వ ఆసుపత్రులు, కిడ్నీ డయాలసిస్‌ సెంటర్, ఆర్‌.డి.వో కార్యాలయం, నగరి ఆర్టివో కార్యాలయం, త్రాగునీటి పైప్‌ లైన్లు, టిటిడి కల్యాణ మండపాలు, నూతన ఆలయ నిర్మాణాలు, దేశమ్మ ఆలయ పునర్నిర్మాణం – కుంభాభిషేకం, ఆలయాల కోనేరు నిర్మాణం, డిఎస్పి కార్యాలయ ఆదునీకరణ, నగరి టవర్‌ క్లాక్, గ్రామీణ రోడ్లు, కల్వర్టులు – డ్రైనేజీ లైన్లు, సియం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పేదలను ఆదుకోవడం, నీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్ళు, సాప్‌ క్రీడా ప్రాంగణాల అభివద్ది, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం, జిల్లాలోనే అధిక సంఖ్యలో గ్రామ సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం, నగరిలో వంద పడకల ఆసుపత్రిని అద్భుతంగా చేసి ప్రజలకి అందుబాటులో తెచ్చానని వివరించారు. టీడీపీ నాయకులు నెత్తికెక్కిన కళ్లు కిందకు దించితే అభివద్ధి కనిపిస్తుందని అన్నారు. పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ అందించాం ఈరోజు ప్రజలంతా నన్ను సొంత బిడ్డ లాగా చూసుకుంటున్నారని తెలిపారు. కోవిడ్‌ సమయంలో రాష్ట్రానికి జగనన్న నగరికి నేను చేసిన సేవ ఎవరూ మరవరన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్‌ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *