Breaking News

మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా… : సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనారిటీల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. సీతారా వద్ద గల ఎన్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ సుజనా కు స్వాగతం పలికారు. టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైజాన్ సభాధ్యక్షత వహించిన సమావేశానికి సుజనా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకొని వారి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ముస్లింల అభివృద్ధిని విస్మరించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ముస్లింలకు ఏ విధంగా సహాయపడ్డాడో అడగాలన్నారు. నియోజకవర్గంలో హజ్ హౌస్ నిర్మాణ శంకుస్థాపన టిడిపి హయాంలో జరిగిందని గుర్తు చేశారు. వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానన్నారు.ముస్లిం మైనారిటీల విషయంలో బిజెపికి చిత్తశుద్ధి ఉందన్నారు. వారి అభివృద్ధి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారికి ఆర్థికంగా చేయూత అందిస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యే కంగా ఎలాంటి పథకాలు అమలు చేయలేదన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూటమికి అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బెగ్ నీర్జా ముజరఫ్ కరిముల్లా మైనారిటీ నాయకురాలు నసీమా బేగం షేక్ మోబీనా ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *