-హింసాత్మక ఘటనలను ఉపేక్షించడం జరుగదు
-అభ్యర్ధుల మధ్య స్నేహపూర్వక వాతావరణం వుండాలి
-పొలింగ్ కేంద్రంలో నియమించే ఏజెంట్లు స్థానికులై వుండాలి
-జిల్లాలో జీరో వైలెన్స్ విధానం లో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలి
-పొలింగ్ ముందు రోజు, పోలింగు రోజున ఇచ్చే పత్రికలలో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
-ఎన్నికలకి 48 గంటల ముందు నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలు
-అభ్యర్ధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో మే 13 సోమవారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ 72 గంటలు సమయ అత్యంత కీలకం అని, ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రీ పార్లమెంటు నియోజక వర్గానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వారీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, మే 11 సాయంత్రం 6 గంటల తరువాత ఎటువంటి ప్రచారానికి, ర్యాలీలు నిర్వహించడానికి, మైక్ ల ద్వారా ప్రచారం చెయ్యడానికి, వివిధ సామాజిక మాధ్యమాల్లో , టీవీల్లో, సినిమా ధియేటర్ లలో ప్రచారాలకు అనుమతులు లేవని తెలియ చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు మే 11 వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే వర్తిస్తాయని, ఈ విషయాన్ని అభ్యర్ధులు గమనించాల్సి ఉందన్నారు. నిశ్శబ్ద సమయం లో వాహనాలు అనుమతుల కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అసెంబ్లి కి పోటీచేసే అభ్యర్ధులు అసెంబ్లి పరిధిలో 3 వాహనాల, పార్లమెంటు కు పోటీచేసే అభ్యర్ధులు పార్లమెంటు సభ్యుడు పరిధిలో 3 వాహనాలు మరియు అసెంబ్లి కి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ధరకాస్తు చేసుకోవాలి అని పేర్కొన్నారు. అభ్యర్ధులు అనుమతి తీసుకున్న వాహనం కేవలం అభ్యర్ధి మాత్రమే తిరగాలని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు ఉంటుందనీ, పోలింగు కేంద్రానికి 100 మీటర్లు, 200 మీటర్ల దూరం వరకు నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఓటరు స్లిప్స్ పంపిణీ చెసే విధానంలో ఎటువంటి ప్రచారం చేయరాదని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన సందర్భంలో ఎటువంటి నోటీసులు ఇవ్వటం జరగదని, బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కసారి ఎన్నికల బైండోవర్ కేసు నమోదు చేసినట్లు అయితే ప్రతి ఎన్నికల్లో ఆయా పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమలు సమయంలో గుంపులు గుంపులుగా వెళ్ళడం నిషేధం అన్నారు.
ఎన్నికల ఫలితాలకు సంబంధించి ముందస్తుగా రాజకీయ పార్టీల ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, మార్చి 16 నుంచి జూన్ 6 వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందనీ మాధవీలత తెలియ చేశారు.
పొలింగ్ కేంద్రానికి సంబందించి ఒక పొలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలివర్లు నియమించుకో వచ్చునని తెలిపారు. పొలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, తగిన గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే పొలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పొలింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డు ఆయా ప్రిసైడింగ్ అధికారులు అందచేస్తారని, ఫారం 10 చూపించి న వారిని పొలింగ్ కేంద్రంలోకి అనుమతి స్తారన్నారు. ఒక్క సారి ఒక్కరికే లోపలకి అనుమతించ నున్నట్లు మాధవీలత తెలిపారు. పోలింగ్ కేంద్రాల బయట లోపల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియా లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు జారీ చేయకూడదని వార్త పత్రిక మాధ్యమాలలో ఈ నెల 12, 13 తేదీలలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచురించ దలచిన ప్రకటన లపై ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీయకుండా ఉండేందుకై ఎన్నికల చివరి దశలో ప్రింట్ మీడియాలో అభ్యంత రకరమైన తప్పుదోవ పట్టించే ప్రకటనలు రాకుండా ఆయా ప్రకటనలు వివరాలు అందచేసి ఎం సి ఎం సి అనుమతులు తప్పనిసరి అన్నారు. మీడియా సంస్థలు అనుమతి లేని ప్రకటనలు ప్రచురించరాదన్నారు. మే 11 తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా లో రాజకీయ ప్రకటనలకు అనుమ తులు లేవని మాధవీలత స్పష్టం చేశారు. శాటిలైట్ చానళ్ళు, కేబుల్ టీవీ , రేడియో ,బల్క్ మెసేజ్ లు,ఈ – పేపర్ లు,సామాజిక మాధ్యమా లు,సినిమా హాళ్లు ,బహిరంగ ప్రదేశాలలో ఉంచే యల్ ఈ డి స్క్రీన్ లు ఎలక్ట్రానిక్ మీడియా కిందకే వస్తాయని, వీటిలో జరిపే ప్రచారాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
పోటిలో నిలిచిన అభ్యర్థులకు ఇప్పటికే ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా అందజేయడం జరిగిందన్నారు. పొలింగ్ కేంద్రాల వారీగా వివరాలు అందచేస్తున్నట్లు తెలిపారు.
13 వ తేదీ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత, ఆయా బ్యాలెట్ యూనిట్స్ నన్నయ్య యూనివర్సిటీ లోని రిసెప్షన్ కేంద్రం తీసుకుని రావడం, అనంతరం ఆయా నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ లలో భద్ర పరుచుటకు జరుగుతుందనీ అన్నారు. అభ్యర్ధులు లేదా వారు నియమించిన ఏజెంట్స్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే వరకూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మే 14 వ తేదీ ఉదయం ఎన్నికల సాధారణ పరిశీలకులు సమక్షంలో స్క్రూటిని చేయనున్నట్లు తెలిపారు.
ఓటర్ స్లిప్స్ కేవలం సమాచారం కోసం మాత్రమే జారీ చేస్తున్నట్లు, ప్రభుత్వం అనుమతించిన 12 ఫోటో గుర్తింపు కార్డు చూపి ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతోందనీ తెలిపారు. నియోజక వర్గానికి, జిల్లాకి చెందిన వారూ తప్ప ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన బయట వ్యక్తులు 48 గంటలు ముందు తప్పనిసరిగా జిల్లా వదలి వెళ్లాలని, ఉల్లంఘన కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన వివిధ ఎన్నికల సమయంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. అదే విధంగా ఈ సార్వత్రిక ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, అభ్యర్ధుల మధ్య స్నేహపూర్వక వాతావరణం లో జరిపి ఎన్నికలను విజయవంతం చేయడం లో అందరి సహకారం అందించాలని కోరారు.
ఓటర్ల ను మభ్యపెట్టే విధంగా బహుమతులు ఇవ్వడం, కూపన్లు జారీ, నగదు పంపిణీ వంటి వాటిపై నిఘా పెట్టడం జరుగుతున్నట్లు, అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా అభ్యర్దులు, వారీ ప్రతినిథులు అడిగిన అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందచేశారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు ,
బిజెపి – బుర్ర రామచంద్రరావు, సిపిఐ(ఎం) – ఎస్ ఎస్ మూర్తి, టిడిపి – సిహెచ్ మణి కృష్ణ, వైఎస్ఆర్సిపి – గూడూరి భారతి రాణి, అభ్యర్థులు కే భానుచందర్, ఎస్ రాఘవేంద్రరావు, ఎస్. మోహన్ రావు, బీవి.శ్రీరామమూర్తి, జె. బాల నవీన, హాజరైనా ఏజెంట్లు పి శ్రీనివాసులు, వైవిఎస్ శ్యామల, డి. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
వారీ తరపున ఏజెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News