Breaking News

కొత్తపేటలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీపై చర్యలు తీసుకోవాలి

-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో ఈ సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో క్యూలైన్ల వద్దనే యధేచ్చగా టీడీపీ సానుభూతిపరులు నగదును పంపిణీ చేశారని విమర్శించారు. దీనిపై వైసీపీ నాయకులు అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేసినా.. చర్యలు మాత్రం శూన్యమని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తరపున ఓటర్లకు బహిరంగంగా నగదును పంపిణీ చేసిన ఘటనపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదును అందజేసినట్లు వెల్లడించారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో గెలుపు కోసం తెలుగుదేశం చేయని కుట్రలు, కుతంత్రాలు లేవని మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా బహిరంగ సభలలో ఇష్టానుసారంగా మాట్లాడారని.. పచ్చ పత్రికలలో తప్పుడు కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రజామద్దతు వైసీపీకే ఉండటంతో నగదు పంపిణీకి తెర తీశారన్నారు. చివరికి కౌంటింగ్ ఏజెంట్లుగా నేర చరిత్ర ఉన్న వారిని సైతం అనుమతించాలని కోరటం తెలుగుదేశం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారో కనీస సమాచారం బయటకి రాకుండా.. కౌంటింగ్ రోజున అల్లర్లకు కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. బాబు పీఏ శ్రీనివాస్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించిన ఇద్దరు మధ్యవర్తులు కూడా విదేశాలకు పారిపోయి అక్కడ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కనుక జూన్ 4 న ఎక్కడా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఈసీని కోరినట్లు తెలిపారు. చంద్రబాబు కుట్రలకు కౌంటింగ్ రోజున మరోసారి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *