Breaking News

కలెక్టర్లు ఎస్పీ తరచూ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ మిని సమావేశ మందిరం వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం శాంతి భద్రతలపై సిఎస్ సూచిస్తూ కలెక్టర్లు ఎస్పీ తరచూ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించాలని అన్నారు.

కలెక్టర్ వివరిస్తూ కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో తగినంత సిఎపీఎఫ్ బలగాలు వచ్చాయని, లూజ్ బాటిల్ లలో పెట్రోల్ అమ్మడం నిషేధానికి చర్యలు తీసుకుంటామని, గుర్తించిన అన్ని పాయింట్లలో కేంద్ర బలగాలకు విధులు ఎస్పీ కేటాయించారని, 144 సెక్షన్ అమలులో భాగంగా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణము ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్, ఎస్ఈ మోహన్ రెడ్డి, ఎస్.ఈ ఏపీ ఎస్పీపీడీసీల్ కృష్ణా రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ కుమార్, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *