విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిఎం.కె.వి.వై పథకం లో భాగంగా జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు వయస్సు 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మద్య గల అభ్యర్ధులకు ”ఎలక్ట్రిషియన్ డోమెస్టిక్ సోల్యుషన్స్ మరియు ప్లంబింగ్ జనరల్ ” స్వల్పకాలిక కోర్సుల యందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ వారు తెలిపారు. కావున 10 వ తరగతి పాస్ మరియు అపై అర్హత గల వారికి కూడా శిక్షణ ఇవ్వబడును. కావున ఆశక్తి గల అభ్యర్ధులు తమ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడి తో విజయవాడ ప్రభుత్వ ఐటిఐ కార్యాలయం లో ఈ నెల 29 మే 2024 లోపు కార్యాలయ పని వేళలో సంప్రదించి ఉచితంగా రిజిస్ట్రేషన్ పొందగలరని పూర్తి వివరాల కొరకు 7780429468, 9966004808, 9985542888, 934 6230112 కు సంప్రదించవచ్చునని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఎస్ టి ఆర్ జిల్లా కన్వీనర్ మరియు ప్రిన్సిపాల్ యం కనకారావు ప్రకటన ద్వారా తెలియచేశారు.
Tags vijayawada
Check Also
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్
-క్షేత్రస్థాయి ఆర్ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …
Prajavartha Online Telugu News