-నియోజక వర్గ కౌంటింగ్ సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని పూర్తి అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుతో కౌంటింగ్ ప్రక్రియపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చాలా ఉపయోగకరం అని, నియోజక వర్గ కౌంటింగ్ సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నందు ఏర్పాటు చేస్తున్న మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ మే 4న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టుటకు చేసే ఏర్పాట్లు ప్రతిబింబించేలా ఈ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్, ఈవిఎం కౌంటింగ్ తదితర ఏర్పాటుతో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నియోజక వర్గాల కౌంటింగ్ సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ కౌంటింగ్ కు వేరుగా టేబుల్ లు, కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు సీటింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్, మెష్, రౌండ్ వైజ్ నోటింగ్ చార్ట్ తదితరాలు ఏర్పాటుతో మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సౌకర్యాన్ని నియోజక వర్గ కౌంటింగ్ విధుల అధికారులు, సిబ్బంది వినియోగించుకుని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పొందాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News