Breaking News

అహింస పాలన కోరుతూ ‘సత్యాగ్రహ నిరాహార దీక్ష’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యపాన నిషేధం…మీ దగ్గర ఉన్న సిబ్బందుల బలగాలకన్నా శాంతి భద్రతలకు ఎంతో రక్షణ అని గాంధీదేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ (నేటి గాంధీ) అన్నారు. శుక్రవారం ఆర్‌.ఆర్‌.గాంధీ నాగరాజన్‌ భవానీపురం ఊర్మిళనగర్‌లోని గాంధీ ఆశ్రమం నుండి విడుదల చేసిన ప్రకటనలో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార నిరసన దీక్ష చేపట్టి గాంధీజీకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాలలో మతసామరస్యం ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ఇలా ప్రజా కోరికలు నెరవేర్చాలని దీక్షలు చేయడం జరిగిందని ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపినట్లు తెలిపారు. నేను గాంధీ, నాలో అంబేడ్కర్‌గా పోరాడుతానన్నారు. శాంతియుతంగా, చట్టపరంగా ప్రజాస్వామ్య రక్షణపై ప్రజలకు నమ్మకం కలగాలన్నారు. విశ్వాసంగా దేశభక్తితో పనిచేయాలని, మతసామరస్యం కాపాడాలని గాంధీ తన లేఖల్లో పేర్కొన్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *