మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వారు తొలుత జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మలతో కలిసి విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ భవనంలోని మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు శాసనసభ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాళ్ళు, స్ట్రాంగ్ రూములు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు గదులు, అక్కడ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటుచేసిన టేబుళ్ళు, కుర్చీలు, ఆర్వోలు పరిశీలకుల టేబుళ్ళు, కౌంటింగ్ ఏజెంట్ల పరిశీలన కోసం ఇనుప కడ్డీలతో మెష్ ఏర్పాట్లు కుర్చీలు,
ఈటీపీబిఎస్, ఎన్కోర్ కౌంటర్లు, కంపైలేషన్ విభాగాలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల లాగ్ బుక్కులను తనిఖీ చేసి సీఈవో సంతకం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో జిల్లా ఎన్నికల అధికారి సీఈఓ కు వివరించారు. కేంద్రంలో నిరంతర విద్యుత్ అంతర్జాలం సరఫరా సజావుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఈవో సూచించారు. అనంతరం సీఈవో అకాడమిక్ భవనం ఎదురుగా నూతన భవనాల్లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ను పక్కనే స్ట్రాంగ్ రూముల పరిశీలన కోసం సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో సీఈఓ వెంట డిఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు రిటర్నింగ్ అధికారులు ఎం వాణి, పి పద్మావతి, పి వెంకటరమణ, శ్రీదేవి, జి బాలసుబ్రమణ్యం, డి రాజు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడి మనిషా త్రిపాఠి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News