రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా

-పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
-శాసన మండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం స్వీకరించిన పి. హరిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్  స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, జనసేన, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్,  తాడిశెట్టి నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *