తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒలింపిక్ క్రీడలు 2024 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించి ఫోటో దిగి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడా కారులకు జిల్లా తరపు నుండి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి అని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ 2024 కు సంబంధించిన సెల్పీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మీడియా తో మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడలు అంగరంగ వైభవంగా జూలై 26 న ప్రారంభమై ఆగస్ట్11 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒలింపిక్స్ 2024 నందు పాల్గొంటున్నాయని తెలిపారు. మన భారత దేశం నుండి మను భాకర్ షూటింగ్ లో కాంస్య పతకం సాధించడం దేశానికి గర్వకారణమని, క్రీడా స్పూర్తితో భారత్ నుంచి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మిగిలిన 117 మంది క్రీడాకారులకు తిరుపతి జిల్లా ప్రజల తరపున జిల్లా కలెక్టర్ మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పాఠశాల స్థాయి నుండే ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News