Breaking News

ప్రజల అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు డ్రోన్ ద్వారా యాంటీ లార్వే ఆపరేషన్లు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం ఆదేశాల మేరకు శుక్రవారం నిల్వ ఉన్న నీటిలో దోమలు రాకుండా ఉండేందుకు యాంటీ లార్వా ఆపరేషన్లు డ్రోన్ల సహాయంతో చేయమని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధునాతన పరికరాలను వినియోగించి దోమల సమస్యలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ వరద ప్రభావిత ప్రాంతాలలో చేస్తున్నారు. శుక్రవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, కండ్రిక, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, రామకృష్ణాపురం, కృష్ణలంక, కబేళ ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో యం. ఎల్ ఆయిల్ స్ప్రే ద్వారా దోమలను నియంత్రించుటకు చర్యలు తీసుకున్నారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *