-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్. యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ శర్వేగంగా జరుగుతున్నాయని, ప్రతి గంటకు బ్లీచింగ్ వేస్తూ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేటట్టు చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సున్నబట్టీలు సెంటర్ నుండి గుణదల వరకు వెళ్లే రోడ్డులో పారిశుద్ధ్య నిర్వహణను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, వరదల వల్ల వచ్చిన వ్యర్థాలను శుభ్రపరుస్తుండాలని, ప్రతి గంటకు బ్లీచింగ్ వేస్తూ ప్రజలను అనారోగ్య బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు. వరదల వల్ల వచ్చిన వ్యర్ధాలను తొలగించడానికి విజయవాడ నగరపాలక సంస్థ వాహనాలు కాకుండా ప్రైవేట్ వాహనాల సహాయంతో శుభ్రపరుస్తుందని, పారిశుద్ధ్య నిర్వాహణకు ఇతర మున్సిపాలిటీ మరియు పంచాయతీల నుండి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి, వారు చేస్తున్న కృషి ఎనలేనిదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వ్యర్ధాలను తొలగిస్తూ సైడ్ కాలువల్లో పూడికలు తీస్తూ, రోడ్డుకి ఇరువైపులా బ్లీచింగ్ పౌడర్ చలుతూ పారిశుధ్య నిర్వహణ పక్కగా చేయాలని అన్నారు.
Prajavartha Online Telugu News