మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ కుమారుని చదువు కోసం ఏపీ యోగా సభ, మచిలీపట్నం తరపున యోగ సభ్యులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం ఉదయం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో యోగా ఉచిత శిక్షణ అనంతరం యోగ గురువులు గురునాథ బాబు, చింతయ్య రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ గొరిపర్తి సారధికి ఇంటర్ చదువుతున్న అతని కుమారుని చదువు కోసం ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ తరపున 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అందులకు వాచ్మెన్ యోగాసభ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈ ఈ భాస్కర్ రావు, డిఐపిఆర్ఓ ఎం వెంకటేశ్వర ప్రసాద్, యోగ సభ్యులు తమ్మన సూర్యనారాయణ తదితర యోగ సభ్యులు సాధకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News