అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ కు అద్భుత‌ స్పంద‌న‌

-డ్రోన్ హ్యాక్‌థాన్‌కు 400 మంది న‌మోదు
-ఔత్సాహికుల కోసం రెండు రోజుల గ‌డువు పెంపు
-విజేత‌ల‌కు న‌గ‌దు బ‌హుమ‌తి రూ.24 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంపు
-డ్రోన్స్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్ వెల్ల‌డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ నెల 22, 23 వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 కు ఔత్సాహికుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వస్తోంది. ఈ జాతీయ స‌ద‌స్సులో భాగంగా ఔత్సాహికు ల‌కోసం డ్రోన్ హ్యాక్ థాన్ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ పోటీలకు ఏకంగా 400 మంది ఔత్సాహికులు న‌మోదు చేసుకున్నారు. మ‌రింత మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన‌డానికి ఉత్సాహం చూపిస్తున్న ద‌ర‌మిలా ఈ పోటీలో న‌మోదుకు గ‌డువును మ‌రో రెండు రోజులు పెంచిన‌ట్లు ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 17 వ తేదీలోపు హ్యాక్‌థాన్‌లో పాల్గొన‌ద‌ల‌చిన‌వాళ్లు త‌మ పేర్ల‌ను ఆన్‌లైన్ ద్వారా న‌మోదు చేసుకోచ్చ‌ని తెలిపారు. 9 థీమ్స్ లో జ‌రిగే పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌ను నాలుగు కేట‌గిరీలుగా వ‌ర్గీక‌రించి ప్ర‌తి కేట‌గిరీ నుంచి ముగ్గురు విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు. ప్ర‌తి విభాగంలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ.3 ల‌క్ష‌లు, ద్వితీయ బ‌హుమ‌తి రూ.2 ల‌క్ష‌లు, తృతీయ బ‌హుమ‌తి రూ.1 ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేస్తారు. 22వ తేదీ జ‌రిగే డ్రోన్స్ జాతీయ స‌ద‌స్సు ప్రారంభోత్స‌వ స‌భ‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌ధానం చేస్తామ‌ని దినేష్ కుమార్ తెలిపారు.

వెయ్యి మంది ప్ర‌తినిధుల హాజ‌రు
రెండు రోజుల పాటు జ‌రిగే ఈ జాతీయ స‌ద‌స్సుకు వెయ్యి మందికిపైగా ప్ర‌తినిధులు హాజ‌రు అవుతార‌ని అంచనా వేస్తున్నారు. మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్‌లో ఈ స‌ద‌స్సు జ‌రిగుతుంది. 22వ తేదీ సాయంత్రి కృష్ణా తీరం పున్న‌మీ ఘాట్‌లో 5 వేల డ్రోన్ల‌తో మెగా షో నిర్వ‌హిస్తున్నామ‌ని, ప్ర‌జ‌లంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని డ్రోన్ షో తిల‌కించాల‌ని దినేష్ కుమార్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *