విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ, అమరావతి సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ వేణు నాదెళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పంజా సెంటర్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అతిథులుగా పాల్గొని ప్రారంభించిన ఈ వైద్య శిబిరానికి దృష్టిలోప సంబంధ బాధితులు భారీగా తరలివచ్చారు. మానవతా దృక్పథంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని టిడిపి తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ అన్నారు. సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందికి కళ్ళజోళ్ళు, 40 మందికి ఆపరేషన్లు అవసరమయ్యాయని వారికి అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ వేణు నాదెళ్ళ కూటమినేతలు దాడి జగన్,సప్పా శ్రీనివాసరావు, ఇంతియాజ్, పెంటపల్లి బాబ్జి, అరవింద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …