గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి సరస్ మేళాను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. స్టాల్స్,, భోజనశాలను, ఫుడ్ కోర్టును, త్రాగునీరు పంపులను పరిశీలించి, స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనగ వారు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు నిరంతర అప్రమత్తంగా ఉంటూ స్టాల్స్ నిర్వహణకు, కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శనివారం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున, …
Read More »Tag Archives: gannavaram
11 మంది లబ్ధిదారులకు రూ. 4.19 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. మంగళవారం గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మంది లబ్ధిదారులకు రూ. 4,19,726 విలువైన ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన అబ్దుల్ ముజీబ్‌కు రూ. 42,833, ఏనుగుపల్లి హిమంజరికి రూ. 40,000, ప్రసాదంపాడుకు …
Read More »ప్రజలపై రూ. 4,498 కోట్ల విద్యుత్ భారం తగ్గింపు : యార్లగడ్డ
-విద్యుత్ చార్జీలు పెంచమన్న ఎన్నికల హామీ అమలు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,498 కోట్ల విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పించారని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 2019- 24 మధ్యకాలంలో ట్రూ అప్ చార్జీలు రూ.4498 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ భారాన్ని ప్రజలపై వేయొద్దని, ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించటం ప్రజలకు మేలు …
Read More »గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా : యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధియే తన ఏకైక లక్ష్యమని, గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పర్యటించిన ఆయన, ‘పల్లె పండుగ 2.0’లో భాగంగా రూ. 2 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం కోటగట్టు సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ బస్సు షెల్టర్‌ను కూడా ప్రారంభించారు. …
Read More »అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, గెలిచిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం మండలంలోని కొత్తగూడెం, తెంపల్లె గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో భాగంగా రూ.85 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. …
Read More »సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గురువారం ఉదయం గన్నవరం మండల టిడిపి ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులతో కలిసి యార్లగడ్డ కేకు కోసి కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే యార్లగడ్డ నూతన …
Read More »నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు
-12వ వి.సి.ఎస్ & టి.ఎ బాలోత్సవంలో యువ ప్రతిభకు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రోత్సాహం ఎనికేపాడు, విజయవాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ & ట్యుటోరియల్స్ అసోసియేషన్ (VCS & TA) ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ VCS & TA బాలోత్సవం ఘనంగా జరిగింది. బాలలలోని దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికి తీసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ యార్లగడ్డ …
Read More »రాయనగర్ కో-ఆపరేటివ్ వజ్రోత్సవాల్లో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు
-సహకార ఉద్యమానికి 75 ఏళ్ల గర్వకర చరిత్ర గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ది రాయనగర్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ప్లాటినమ్ జూబ్లీ (వజ్రోత్సవ) ఉత్సవాలు, అలాగే సొసైటీ స్థాపకులు మరియు దాని పురోగతి, అభివృద్ధికి నాయకత్వ స్థాయిలో విశేష సేవలందించిన డా॥ సి.యల్. రాయుడు, కె. పెద వెంకట రాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సొసైటీ స్థాపన నుంచి 75 వసంతాల గర్వకర ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన అనంతర సభలో …
Read More »నేటి తరం రాజకీయ నాయకులకు వాజ్ పాయి జీవితం ఆదర్శనీయం: యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన వాజ్ పాయ్ లాంటి మహానుభావుడిని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ శత జయంతి ఉత్సవాలు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి జన్మదినోత్సవాన్ని బిజెపి ఆధ్వర్యంలో రోటరీ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట్రావు …
Read More »పారిశ్రామిక వాడలో సమస్యల పరిష్కారానికి చర్యలు : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. మల్లవల్లి నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ కమిటీ(ఐలా)ని ఇటీవల నూతనంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు బుధవారం రాత్రి విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డను మర్యాదపూర్వకంగా కలిసి పారిశ్రామికవాడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పారిశ్రామిక వాడలో విద్యుత్ అంతరాయాలను నివారించాలని, కొత్తగా పరిశ్రమల నిర్మాణానికి అనువుగా …
Read More »
Prajavartha Online Telugu News