Breaking News

పాతగన్నవరంలో వైభవంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్య స్వామివార్ల కల్యాణ మహోత్సవం

-ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పాతగన్నవరంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామివార్ల వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా, అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. యార్లగడ్డ దంపతులు ఉత్సవ విగ్రహాలకు తీసుకుని వెళ్లగా కళ్యాణ నిర్వహించారు. ఉదయం నుంచే ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించగా, ఆలయ ఆవరణను విద్యుత్ దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ముత్యాల కల్యాణ వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వేడుకకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్ బృందం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల మధ్య పాతగన్నవరం గ్రామం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బలవర్ధన రావు, స్థానిక నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *