గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేదని, ఎక్కడైనా సిబ్బంది, అధికారులు, సచివాలయ సెక్రెటరీలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం ముత్యాలరెడ్డి నగర్, వికాస్ నగర్, జేకేసీ రోడ్, మ్యాంగో స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్దేశిత ‘పిన్ పాయింట్ ప్రోగ్రాం’ లేకుండా విధుల్లో ఉన్న 112వ వార్డు …
Read More »Tag Archives: guntur
గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేత…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ సెక్రెటరీగా వజ్జా రామకృష్ణ ఎన్నికైనట్లు డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించి, గెలిచిన అభ్యర్ధులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశామని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం …
Read More »మీకోసం వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చు
-సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో మాత్రమే కాకుండా “మీకోసం” వెబ్ సైట్ లోను ఆన్ లైన్ లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ఎన్నికల్లో 2,160 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సర్వం సిద్దం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గానికి ఆదివారం జరగనున్న ఎన్నికల్లో 2,160 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సర్వం సిద్దం చేశామని ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫీషియో వైస్ ప్రెసిడెంట్, అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. మార్చ్ 1న జరగనున్నఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గ …
Read More »రోడ్లమీద, డ్రైన్లలో వ్యర్ధాలు పడకుండా సమగ్ర పారిశుధ్య పనులు చేపట్టాలి …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లమీద, డ్రైన్లలో వ్యర్ధాలు పడకుండా సమగ్ర పారిశుధ్య పనులు చేపట్టాలని, అలా వేసేవారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని నగర కమిషనర్ కె.మయూర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, తడిపొడిగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్గించాలని, గత ఏడాది గుంటూరు …
Read More »కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఈ నెల 25 నుండి 27 వరకు న్యూ డిల్లీలోని భారత్ మండపంలో మునిసిపాలికా 2026 18వ “ఇంటర్నేషనల్ ఎగ్జిబీషన్
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఈ నెల 25 నుండి 27 వరకు న్యూ డిల్లీలోని భారత్ మండపంలో మునిసిపాలికా 2026 18వ “ఇంటర్నేషనల్ ఎగ్జిబీషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆన్ సేఫ్, స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ సోసొల్యుషన్స్ ” పాల్గొన్న నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సురక్షిత, సుస్తిరాభివృద్ధికి నగరాలు, పట్టణాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో కమిషనర్ మయూర్ అశోక్ కూడా రాష్టంలోని ఇతర కార్పోరేషన్ల కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు. …
Read More »జిఎంసికి పన్ను బకాయిదారుల వివరాలతో నగరంలో ప్రదర్శన బోర్డ్ లు ఏర్పాటు….
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసికి పన్ను బకాయిదారుల వివరాలతో నగరంలో ప్రదర్శన బోర్డ్ లు ఏర్పాటు…. కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు నగరపాలక సంస్థ డిమాండ్ నోటీసులు అందించినప్పటికీ స్పందించని, ఖాళీ స్థల బకాయిదారులకు గురువారం నుండి చెల్లించాల్సిన బకాయి వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డ్ లను ఆయా యజమానుల స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నామని, అప్పటికీ స్పందించని యెడల ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ రెవెన్యూ వసూళ్ల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. ఈ …
Read More »గుంటూరు నగరంలో రోడ్, డ్రైన్ ఆక్రమణలు, అనధికార బ్యానర్ల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్..
గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు, ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజా సౌకర్యార్ధం ప్రధాన రోడ్లఫై, డ్రైన్ ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే తొలగింపులో జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు నగరంలోని అమరావతి రోడ్, జిటి రోడ్ ల్లోని పలు ప్రాంతాల్లో 47 ఆక్రమణల …
Read More »మిషన్ శక్తి స్కీమ్ క్రింద పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, గుంటూరు వారి ఆధీనములోని మిషన్ శక్తి స్కీమ్ క్రింద వన్ స్టాప్ సెంటర్ లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు అనగా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (1), కేసు వర్కర్ (2), ప్యారా లీగల్ పర్సనల్/లాయర్ (1), ప్యారా మెడికల్ పర్సనల్ (1), సైకో సోషల్ కౌన్సిలర్ (2), ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ పరిజ్ఞానము (1), మల్టీ పర్పస్ స్టాఫ్ (3), సెక్యూరిటీ గార్డ్ (3) కాంట్రాక్టు పద్ధతిపై …
Read More »
Prajavartha Online Telugu News