Breaking News

Tag Archives: machilipatnam

వేట ఆగినా…. ప్రభుత్వ చలవతో పూట గడిచింది !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఏడాదిలో పది నెలల పాటు సాగరాన్ని మథించే సాహస జీవనాన్ని సాగిస్తుంటారు. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే వీరు.. బతుకు పోరాటంలో దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. వేటే వీరి జీవనాధారం.. ఆ వేట ఆగితే.. ఆ పూట గడిచేది కడుభారం. ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ విధించే వేట నిషేధం కాలంలో బతుకు జీవనం పెను సవాల్గా …

Read More »

ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కారం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ శాఖలలో బదిలీలు, పదోన్నతులు, కారుణ్య నియామకాల వివరాలను సిద్ధం చేస్తామని, పెండింగ్ కేసులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రత్యేక ఎంప్లొయ్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగి ఆశించిన దానికి…పొందే వాటికి మధ్య అంతరం ఉన్నప్పుడు మనోవేదనకు ప్రధాన కారణమవుతుందని, ఉద్యోగి ఫిర్యాదు అనేది …

Read More »

జడ్పి ఆస్తులు పరిరక్షించి, ఆదాయ మార్గాలు అన్వేషించండి… : జడ్పి చైర్‌పర్సన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆదాయ మార్గాలు అన్వేషించాలని జడ్‌పి చైర్‌పర్సన్ ఉప్పాల హారికా ఎంపిడివోలు, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జడ్‌పి సమావేశ మందిరంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేసిన వివిధ పనుల ప్రగతిని సమీక్షించి జరుగుతున్న అభివృద్ధి పనులు, జడ్‌పి ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని, అలాగే ఆదాయమార్గాల అన్వేషణ, వివిధ వనురులను సమకూర్చుటకు ప్రణాళికలు రూపొందించడం, ప్రధాన …

Read More »

ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాగునీటి విడుదల చేస్తున్న నేపధ్యంలో ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు చేరేలా కాలువల నిర్వహణ సక్రమంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి , మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్న ఈ రివ్యూలో పలు విషయాలు అధికారులతో చర్చించారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురై ఎగువ ప్రాంతం …

Read More »

ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలి !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తాను ఈ దేశంలో 130 కోట్లమంది ప్రజలకు ఒక సేవకుడిగా భావిస్తున్నానని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలని, పేద ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమఅయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో రిడ్జ్ మైదాన్ లో జరిగిన ‘ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ’లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొని …

Read More »

మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ, నడి వేసవిలో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు ఉచితంగా అల్పాహారంపెట్టి, చల్లని మజ్జిగ వారికి అందచేయాలనే మానవత్వంతో కూడిన మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కొనియాడారు. సోమవారం ఉదయం కృష్ణా కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంకు వచ్చే పలువురు స్పందన అర్జీదారులకు ఉచిత మజ్జిగ అల్పాహార పంపిణీ శిబిరంను కలెక్టర్ పి. రంజిత్ బాషా, మచిలీపట్నం పార్లమెంట్ …

Read More »

పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువు పెంపు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని, వచ్చే నెల జూన్ 10 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణాజిల్లా కలెక్టర్ జి. రంజిత్ బాషా తెలిపారు. సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, కృష్ణా జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ పాప్టర్లకు గౌరవ వేతనంపై నూతన మార్గదర్శకాలతో ధరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. పాస్టర్ల గౌరవ వేతనం మంజూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని వీటిని అనుసరించి …

Read More »

పీఎం కేర్స్ స్కాలర్షిప్లను పంపిణీ చేసిన ఎం పి బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని తల్లిదండ్రులకు పిల్లలను, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిందని అంతటి దైన్య స్థితిలో ఎంతో మంది చిన్నారులు జీవితంలో ఎంతో దైర్యంగా నిలబడ్డారని వారందరికీ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని వారిని అన్ని విధాలా అదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వీడియో …

Read More »

అందుతున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు…

-చినగొల్లపాలెంలోని గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనలో మంత్రి జోగి రమేష్ చినగొల్లపాలెం/గౌడపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాల పట్ల ప్రజలందరు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గురువారం ఆయన కృత్తివెన్ను మండలం, చినగొల్లపాలెంలో మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై లబ్ధిదారులను ఆరా తీశారు. ఆ కుటుంబానికి ఇప్పటివరకు అందిన పథకాల లబ్ధిని …

Read More »

జిల్లాలో జగనన్న పాల వెల్లువ పధకం మరింత సమర్ధంగా అమలు చేయుటకు కార్యాచరణ రూపొందించాలి… 

మ‌చిలీప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో జగనన్న పాల వెల్లువ పధకం మరింత సమర్ధంగా అమలు చేయుటకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ముంగళవారం కలక్టరేట్‌లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమ అమలుతీరుపై సహకారశాఖ, పశుసంవర్ధకశాఖ, డైరీ డెవలప్మెంట్, డిఆర్‌డిఎ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల విభజన అనంతరం కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ పధకం అమలు తీరుపై డైరి డెవలప్‌మెంట్ శాఖ అధికారులు సమావేశం ప్రారంభంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. …

Read More »