విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రశంసించారు. మ్యాచ్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారతదేశాన్ని గెలిపించిన జట్టు సభ్యులు అంతా అభినందనీయులన్నారు. ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని ప్రస్తుతించిన గౌరవ గవర్నర్ 41 సంవత్సరాల విరామం తర్వాత హాకీ క్రీడలో ఒలింపిక్స్ వేదికగా పతకం అందుకోవటం శుభ పరిణామమని పేర్కొన్నారు. భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా …
Read More »Tag Archives: vijayawada
ఆదివారం నాటికి 80 గ్రామ సచివాలయాలకు రెండవ పైకప్పు వేయాలి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు వేగవంతం చేసే దిశగా 80 గ్రామ సచివాలయాలకు వచ్చే ఆదివారం లోపు రెండవ పైకప్పు వేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. బుధవారం స్థానిక రైతు శిక్షణా కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామ సచివాలయాలు, ఆర్ బికె, హెల్త్ క్లీనిక్స్ భవనాల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా ప్రగతి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల పురోగతిలో …
Read More »కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని, జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసనసభ్యులు డా.మొండితోక జగన్మోహన్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రీయ విద్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే తాత్కాలిక తరగతుల నిర్వహణకు వసతి ఏర్పాట్లను బుధవారం నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు తరగతిగదుల నిర్మాణానికి సంబంధించి పనులపై అధికారులతో సమీక్షించారు. పాలిటిక్నిక్ కళాశాలలో అవసరమైన మరమత్తులను కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన 5.34 ఎకరాల భూమిని కూడా కలెక్టర్ జె.నివాస్ శాసనసభ్యులు డా. …
Read More »కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలకం… : కలెక్టర్ జె.నివాస్
-సచివాలయ సేవలను గడువులోగా పరిష్కరించండి…. -లబ్దిదారులకు సంతృప్తి స్థాయిలో సేవలందించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వ్యాప్తి నియంత్రణకు ఫీవర్ సర్వే అత్యంత కీలక మని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. నందిగామ అర్బన్ లోని మధిర రోడ్డులోని సచివాలయాన్ని బుధవారం నందిగామ శాసనసభ్యుడు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి కలెక్టర్ జె. నివాస్ ఆకస్మీక తనిఖీ చేసి సచివాలయం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సేవల తీరును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫీవర్ సర్వే ఖచ్చితత్వంగా నిర్వహించడం ద్వారా …
Read More »జగనన్న కాలనీల్లో త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి…
-ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లను త్వరగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బుధవారం జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుటను గృహనిర్మాణ, రెవెన్యూ, తదితర శాఖ అధికారులతో కలసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు ప్రారంభం గాని ఇళ్లను …
Read More »సెప్టెంబరు 1వ తేదీన పాలిసెట్-2021 ఎంట్రన్స్ పరీక్ష…
-ఈనెల 13వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు ధరఖాస్తుల స్వీకరణ.. -10వ తరగతి పరీక్ష పాసైన వారందరూ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు… -ఎంట్రన్స్ నిర్వహణకు రాష్ట్రంలో 380 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం… -పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ పాఠ్యాంశాలలో మార్పులు… -రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనరు పోలా భాస్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించి 72 వేల సీట్లు భర్తీ చేయడానికి పోలీ సెట్ – 2020-21 ద్వారా ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని …
Read More »అకాడమి ద్వారా ఉర్దు భాషాభివృద్ధికి కృషి చేస్తాం…
-విద్యద్వారానే సామాజిక ఆర్థికాభివృద్ధి సాధ్యం… -అంబేద్కర్, పూలే ఆశయాల బాటలోనే మైనారిటీల సంక్షేమానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కృషి… -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉర్దు అకాడమి ఛైర్మన్ పదవికి వన్నె తెచ్చేవిధంగా నదీం అహ్మద్ విధులు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ భాషా సూచించారు. బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ లో గల ఉర్దు అకాడమి కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖా …
Read More »చంద్రబాబు హయాంలో చీకటి రోజులను రైతులు ఇంకా మరిచిపోలేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-జగనన్న పాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది -రైతు స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుణదల ప్రాంతంలోని 1వ వార్డు సచివాలయంలో నిర్వహించిన రైతు స్పందన(రైతు సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉద్ధంటి సునీత సురేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నదాతలకు ఎరువులు …
Read More »ప్రజాసమస్యల పరిష్కారానికే వార్డు పర్యటనలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ పర్యటనలు నిర్వహిస్తోన్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ లోని లెనిన్ నగర్ లో కార్పొరేటర్ శ్రీమతి ఉద్ధంటి సునీత గారితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటుగా.. స్థానిక సమస్యలపై ఆరా …
Read More »చేతి వృత్తి దారుల జీవన ప్రమాణ స్దాయి పెంపుకు కృషి… : లేపాక్షి ఛైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి
-ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం -బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేయాలని వక్తల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతి వృత్తిదారుల జీవన ప్రమాణ స్ధాయిని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల అభివృద్ది సంస్ధ (లేపాక్షి) ఛైర్ పర్సన్ బడిగించల విజయలక్ష్మి అన్నారు. విజయవాడ లేపాక్షి షోరూమ్ ఆవరణలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమక్షంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్ధ ఛైర్మన్ గా …
Read More »
Prajavartha Online Telugu News