-మెరుగైన ప్రసూతి వైద్య సేవలు అందించాలి
-గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి ని ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ సారధ్యంలో నిర్వహించారు. గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలో గల ట్రస్ట్ కార్యాలయంలో ఆర్ఆర్ గాంధీ నాగరాజాన్ తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ట్రస్ట్ కార్యాలయం నుండి కళ్ళకు గంతలు కట్టుకొని, అర్థ వస్త్రాలతో సభ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సబ్ కలెక్టర్ సంజన సింహకు స్త్రీలకు రక్షణ కావాలని, స్త్రీలకు మెరుగైన ప్రసూతి వైద్య సేవలు ప్రభుత్వం అందించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించిన గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో స్త్రీలకు రక్షణ లేకపోవడం, స్త్రీల గౌరవించబడలేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు రక్షణ లేని స్వాతంత్రం స్వతంత్రం కానే కాదని స్పష్టం చేశారు. స్త్రీలకు రక్షణ పూర్తిస్థాయి సమానత్వ హక్కులు కల్పించినప్పుడే పూర్తిస్థాయిలో స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. ప్రపంచ శాంతి కోరుతూ దండియాత్ర 2 పేరుతో గాంధీ, అంబేద్కర్ విధానాలను పాటిస్తూ దేశవ్యాప్త యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. దండియాత్ర 2 ను గత సంవత్సరం జనవరి 31 తేదీన అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ప్రారంభించినట్లు చెప్పారు. దండియాత్ర 2 పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీజీని అతి దారుణంగా చంపిన రోజని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీజీ మరణానికి 77 ఏండ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో దండియాత్ర 2ను ప్రారంభించి తాను విజయవాడ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సైతం నిరసన పాదయాత్ర కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. మనదేశంలో స్వార్థ చింతన లేని నాయకుడు లేనే లేడు అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రజా ప్రతినిధుల్లో అధికారుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించని రోజులు వచ్చాయన్నారు. కొంతమంది మానవతామూర్తులు ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేయడం హర్షించే విషయం అన్నారు. స్వాతంత్రం సిద్ధించి 77 ఏండ్లు దాటిన మనదేశంలో నేటికీ స్వేచ్ఛ లేని జీవులు మహిళలు అన్నారు. మహిళలకు రక్షణ సమానత్వం లేవన్నారు. పార్లమెంటు సాక్షిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అన్న అంశం 33 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. దండియాత్ర 2 ద్వారా 810 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించినట్లు చెప్పారు. ఎంతోమంది ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులను కలసి వినతి పత్రాలు సమర్పించిన విషయాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రసవ సమయంలో కొంతమంది మహిళలు ప్రాణాలను సైతం కోల్పోవాల్సిన పరిస్థితులు బాధాకరమన్నారు. గర్భిణీ స్త్రీలకు విఐపి స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆలోచించి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యం అందించే చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. ప్రైవేటు వైద్యశాలలు గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు, ప్రసూతి సేవలు అందించే క్రమంలో లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ గా పుట్టటం పాపమా శాపమా అంటూ ప్రశ్నించారు. గాంధీజీ కలలు కన్నా స్త్రీల స్వేచ్ఛ విధానాలను పాలకులు అమలుపరచాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు వైద్య సేవల నిమిత్తం గుంటూరు విజయవాడ వంటి పట్టణాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గాలు సైతం లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయం వరకు ప్రభుత్వమే బాధ్యతతో విఐపి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశాన్ని వెల్లడిస్తూ సభ కలెక్టర్ సంజన సింహపు వినతిపత్రం అందించడం జరిగిందని చెప్పారు. దండియాత్ర 2 కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బ్రతికితే దేశం కోసం చనిపోతే దేశం కోసం అన్న మాటలు వెలువడిస్తూ జైహింద్ తో ముగించారు. ఆ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు.