Breaking News

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని అవుట్‌ఫాల్ డ్రెయిన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్, కండ్రిక జంక్షన్, ఇన్నర్ రింగ్ రోడ్, డీసిల్టింగ్ పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో కొనసాగుతున్న డీసిల్టింగ్ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం కలగకుండా విస్తృతంగా డీసిల్టింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం వర్షాలు పడుతున్న సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా డ్రెయిన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ డీసిల్టింగ్ పనులు చేపడుతున్నప్పటికీ, వర్షాలు కురిసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా డీసిల్టింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి ప్రవాహానికి ఎక్కడా ఆటంకాలు ఏర్పడకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.

ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌పై ఆకస్మిక తనిఖీ

అనంతరం పాతపాడు లోని ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను కమిషనర్ ధ్యానచంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారా, పరీక్షల నివేదికలు సక్రమంగా ఉన్నాయా, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, ప్లాంట్ పరిసరాల్లో పారిశుధ్య, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నగరంలోని ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ, ప్రజలకు అందించే తాగునీటి నాణ్యతను నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు కూడా నిరంతరం నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. నీటి నాణ్యతకు సంబంధించిన నివేదికలు సక్రమంగా లేకపోతే వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు కేవలం శుద్ధమైన, నాణ్యమైన తాగునీరు మాత్రమే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లుగానే, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గ్లోరీ, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, గోపాలకృష్ణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. అన్నపూర్ణ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *