Breaking News

ఈ ఏడాది నినాదం నినాదం టేక్ ది రైట్స్ పాత్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినం 2024 కార్యక్రమంలో భాగంగా ఏపీ సాక్క్స్ వారి ఆదేశాలను సారం తిరుపతి జిల్లా కలెక్టర్ వారి అనుమతితో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి సహకారంతో ఎయిడ్స్ దినం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు శ్రీహరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పైన అవగాహన కల్పించారు.

క్రమం తప్పకుండా ART మందులు వాడితే హెచ్ఐవి సోకినప్పటికీ జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని తెలిపారు. కావున హెచ్ఐవి సోకినవారు క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే మందులు వాడాలని సూచించారు. డాక్టర్ రవి ప్రభు సూపర్ఇండెంట్ ఎస్ వి ఆర్ ఆర్ జి జి హెచ్ హాస్పిటల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ టేక్ ద రైట్స్ పాత్ అంటే కమ్యూనిటీ అందరూ కూడా వారి యొక్క హక్కులు మార్గం ఎంచుకోవాలి అని తెలియజేశారు. అలాగే కమ్యూనిటీ అందరూ కూడా నియంత్రణ పద్ధతులు పాటించి హెచ్ఐవి వ్యక్తిని అరికట్టాలని తెలియజేశారు. రమేష్ గారు తిరుపతి జిల్లా నెట్వర్క్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడడం జరిగింది కమ్యూనిటీ వారి ఎదుర్కొన్న సమస్యలు తెలియచేసి వాళ్ళలాగే ఇతరులు హెచ్ఐవి బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్డప్ప మరియు వారి కళాబృందం డప్పుకొడుతూ పాటలు పాడుతూ అవగాహన కల్పించారు.

డాక్టర్ చంద్రశేఖరన్ ప్రిన్సిపాల్ ఎస్వీ మెడికల్ కాలేజ్ మాట్లాడుతూ హెచ్ఐవి తో బాధపడుతున్న వారికి చికిత్స చేసేటప్పుడు కానీ అట్లాగే వారిపట్ల సమాజంలో వివక్షత లేకుండా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి పైన IEC మెటీరియల్ను పోస్టర్ రూపంలో విడుదల చేయడం జరిగింది.

అలాగే ఈ సంవత్సరంలో బాగా పనిచేసిన సిబ్బంది మరియు ఎన్జీవోస్ కి గుర్తింపు మరియు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ పి శ్రీనివాసరావు డిపిఎమ్ఓ, డాక్టర్ రూప్ కుమార్ డిస్టిక్ మలేరియా ఆఫీసర్, మోహన్ కుమార్ సీఈవో సెట్విన్ మరియు డాక్టర్ ఆనందరావు ఏఆర్టి మెడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *