Breaking News

మైనారిటీ విద్యార్థుల‌కు ఉచిత డీఎస్‌సీ శిక్ష‌ణ‌

– ఈ నెల 10వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
– మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఈడీ ఎస్‌కే ఫ‌ర్జానా బేగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత డీఎస్‌సీ శిక్ష‌ణ‌కు అర్హులైన మైనారిటీ విద్యార్థుల (ముస్లింలు, క్రిస్టియ‌న్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైనులు) నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేష‌న్ కార్య‌నిర్వాహ‌క సంచాల‌కులు ఎస్‌.కె.ఫ‌ర్జానా బేగం మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. www.apcedmmwd.org వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 10లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. పూర్తి వివ‌రాల‌కు డైరెక్ట‌ర్‌, సెంట‌ర్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్‌, స్వాతి థియేట‌ర్ ఎదురుగా, భ‌వానీపురం, విజ‌య‌వాడ‌-520012 (ఫోన్‌: 0866 – 2970567)లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *